SRCL: ఈనెల 24 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు సిరిసిల్లలో భవన, ఇతర రంగాల నిర్మాణ కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున ఈ సదస్సుకు కార్మికులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.