ELR: నూజివీడులోని స్టేషన్ తోటకు చెందిన అమృతల అబ్రహం ఇంటిలో సోమవారం చోరీ జరిగింది. పదివేల రూపాయల నగదు, రెండు జతల బంగారు చెవి దిద్దులు గుర్తుతెలియని అగంతకులు చోరీ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశంలో క్లూస్ టీం అగంతకుల వేలిముద్రల కోసం పరిశోధన చేపట్టారు.