ELR: ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐ.జగన్నాథపురంలో జరిగిన ఈ భేటీలో నరసాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులు, పలు సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.