AP: సివిల్ సప్లై అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సూచనలు చేశారు. పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షల మె.టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.400 కోట్లు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని పేర్కొన్నారు.