GDWL: జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాజీవ్ రెడ్డి సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ను కలిశారు. ఈ భేటీలో రాబోయే స్థానిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించడానికి విస్తృతంగా కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డికి దిశానిర్దేశం చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.