ATP: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఎస్పీ పి. జగదీష్ మొత్తం 99 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను చట్ట పరిధిలో నిశితంగా పరిశీలించి, నిర్దేశిత సమయంలోపు పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.