MDK: తూప్రాన్ పట్టణంలోని అవుసుల కుంట కట్ట తొలగింపుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు. కుంటకట్టను 8 మీటర్ల మేర తొలగించి నష్టం చేసినట్లు ఇరిగేషన్ ఏఈ అనురాధ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కుంట కట్టను తొలగించిన వ్యక్తులతో పాటు, ఉపయోగించిన జేసీబీ (TS 35 B 1974) యజమాని లింగంపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.