TG: హైదరాబాద్లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు, వాటి నిర్వాహకుల నివాసాల్లో ED తనిఖీలు జరిగాయి. జనప్రియ, రాజా డెవలపర్స్, సత్యసాయి, గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్ట్రక్షన్స్తో సహా మొత్తం 8 సంస్థల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రీలాంచ్ స్కీమ్ పేరిట రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు.