ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తెహ్రీ జిల్లాలో నరేంద్రనగర్ వద్ద ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విషయం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.