ASF: పులుల లెక్కింపులో ఆసక్తి ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలని ఆసిఫాబాద్ DFO సుశాంత్ సుఖ్ దేవ్ బోబడే సోమవారం కోరారు. దరఖాస్తుకి గడువు ఈ నెల 30 వరకు ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి అటవీశాఖ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఎంపికైన వారు జనవరి 17 నుంచి 23 వరకు ప్రతిరోజూ అడవిలో తిరుగుతూ పులులు, ఇతర వన్యప్రాణుల లెక్కింపు చేపట్టాలన్నారు.