NLG: నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఈనెల 29న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. కట్టంగూరులో సోమవారం జరిగిన ప్రెస్మీట్లో ఆయా కేంద్రాల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు గురించి శ్రేణులకు వివరించారు. తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారన్నారు.