KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రవచన మంటపంలో బెంగళూరుకు చెందిన హరి గుడి గయా గాయిని గ్రూపు భజనలు, భక్తి గీతాలతో భక్తులను అలరించింది. రాఘవేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి, హరికథామృత సారం వంటి పాటలు భక్తిలో ముంచాయి. 57 మంది సభ్యులతో కూడిన ఈ గ్రూపు మంత్రాలయంలో 150వ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆర్గనైజర్ మైత్రి తెలిపారు.