భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరసనకు ఈరోజు TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు తెలిపారు. పని సమయంలో అనుమానాస్పదంగా మృతి చెందిన కార్మికుడు బొల్లి రాజయ్య కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, ఉద్యోగం ఇవ్వాలని, బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.