TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8,9వ తేదీల్లో రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఇవాళ అందుకు సంబంధించిన లోగోను విడుదల చేశారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.