MBNR: రాజాపూర్ మండలం కుచ్చర్కల్ గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి గ్రామస్తులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత సత్యం మాట్లాడుతూ.. గ్రామంలో ఐకేపీ కేంద్రం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరామన్నారు.