కోనసీమ: మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణకు మతిస్థిమితం సరిగా లేదని, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. సోమవారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చర్చకు సిద్ధమా అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.