MNCL: ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురిచేస్తోందని.. తల్లిదండ్రులు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినులు రాసిన లేఖ జిల్లాలో సంచలనం రేపింది. బెల్లంపల్లిలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేస్తుందని విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్ సమస్యలు విన్నవిస్తే ‘మీరు రైతు బిడ్డలు మీకెందుకు ఇవన్నీ’ అని అంటుందని ఆరోపించారు.