TG: ఐబొమ్మ రవిది మొదటి నుంచీ క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తెలిపారు. ఆయన భార్యను కూడా విచారించినట్లు వెల్లడించారు. భార్య, పిల్లలను చిత్రహింసలకు గురిచేసేవాడని.. రవి ప్రవర్తన నచ్చక భార్య విడాకులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా.. రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవన్నారు.