TG: వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెలా అందించే ‘చేయూత పింఛన్ల’ను మరింత సులభంగా ఇచ్చేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సెర్ప్ అధికారులు ముఖ గుర్తింపు ప్రక్రియను అమలు చేయనున్నారు. ఇప్పటికే దీనిపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పింఛన్ దారులకు సెర్ప్ సిబ్బంది ముఖ గుర్తింపు ప్రక్రియను యాప్ ద్వారా పూర్తి చేసి డబ్బులు అందజేయనున్నారు.