NDL: నందికొట్కూరు ప్రాంతీయ పశువైద్యశాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శిథిలావస్థలో ఉన్న డాక్టర్స్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. నూతన పశువైద్యశాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి R&B అధికారులకు ఆదేశాలు ఇస్తానని, పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలిపారు. అనంతరం మెడిసిన్ డిస్పెన్సింగ్ గది, రికార్డులను ఎమ్మెల్యే తనిఖీ చేశారు.