AP: ఆరోగ్యాంధ్ర సాకారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్లో సీఎం అధ్యక్షతన తొలి సమావేశం జరగనుంది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ఆమోదించారు.