ATP: శింగనమల నియోజకవర్గంలో అరటి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు సాగుచేసిన రైతుల సమస్యలపై మాట్లాడేందుకు మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ రేపు జిల్లా కలెక్టర్‌ను కలవనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొంటారన్నారు. రైతులు, నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.