కోనసీమ: అన్ని ప్రభుత్వ పత్రాల్లో ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా’ పేరును చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నట్లు జేసీ టి. నిశాంతి తెలిపారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖలో ఈ మార్పు జరిగిందని, మిగిలిన శాఖల్లోనూ పూర్తిస్థాయిలో పేరు మారేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం పడుతుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు.