సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 201 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో SAకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయినప్పటికీ దక్షిణాఫ్రికా.. భారత్‌ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని విధించే అవకాశం ఉంది.