MBNR: సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకి సూచించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొత్తం 110 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (CEIR) సహకారంతో ట్రేస్ చేసి, సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కవాతు మైదానంలో బాధితులకు అందజేశారు. ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు.