VZM: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష నేడు తెలిపారు. నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, స్థల యజమాని NOCను జతచేయాలన్నారు.