GNTR: తెనాలిలో ఈ నెల 27 తేదీన జరుగనున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు ఉదయం విజయవాడ నుంచి పినాకిని ఎక్స్ప్రెస్లో తెనాలి చేరుకుని స్వర్గీయ యడ్లపాటి వెంకట్రావు నివాసానికి వెళ్లి అల్పాహారం చేస్తారు. అనంతరం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని స్థానిక మీడియా తెలిపింది.