NZB: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా నలుమూలల నుంచి మొత్తం 141 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఫిర్యాదుల్లో 106 అర్జీలు కేవలం రెండు పడకల ఇళ్లకు సంబంధించినవి కాగా, 35 రెవెన్యూ సంబంధించినవని అన్నారు.