ATP: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణం భారత సినిమా రంగానికి తీరని లోటు అని ఎమ్మెల్యే పరిటాల సునీత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తెరపై చూపిన సహజ నటన, వినయం, భావోద్వేగం తరతరాలకు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు సునీత తెలిపారు.