TG: పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలకు చెందిన రూ.80 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సంతోష్ శాండ్, గ్రానైట్ వ్యాపారంలో సుమారు రూ.300 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఈ అక్రమ మైనింగ్ ఆదాయానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది.