KMM: ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. సోమవారం జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామపంచాయతీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు.