TG: మహిళలను సోలార్ ప్లాంట్లకు యజమానులను చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డ పెత్తనం ఉన్న ఇల్లు గొప్పగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కొడంగల్లో పర్యటిస్తున్న సీఎం.. రాష్ట్రంలో ఒకే ఒక్క సైనిక స్కూల్ అక్కడే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం టిఫిన్ అందించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో 5వేల విద్యార్థులు పెరిగాయన్నారు.