NRPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ మరికల్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ ఛైర్మన్ సదాశివరెడ్డి, ఎంపీడీవో పృథ్వీరాజ్, MRO రామకోటి కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి మహిళలకు చీరలు అందజేశారు. మండలంలోని 17 గ్రామాలకు 6710 చీరలు పంపిణీ చేయనున్నట్లు ఏపీవో చెన్నప్ప తెలిపారు.