NLG: ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. సోమవారం స్థానిక పీఎన్ఎం కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 6, 7 తేదీలలో మాడుగులపల్లిలో ప్రజానాట్యమండలి జిల్లా ఎనిమిదవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.