CTR: అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా.. అంటూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పలువురు రైతులను ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “రైతన్నా మీకోసం” కార్యక్రమాన్ని సోమవారం రూరల్ మండలం పెరుమాళ్ల కండ్రిగ గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ రైతులతో ఆప్యాయంగా మాట్లాడారు.