కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు అందిస్తున్న విషయం గుర్తించుకోవాలన్నారు. సర్పంచులు లేకపోవడంతో.. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు.