NLG: ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పల్స యాదగిరి డిమాండ్ చేశారు. ఆయన ఇవాళ నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో ప్రజాసంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని ఎన్కౌంటర్ పేరిట కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు.