RR: హయత్నగర్ డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో జరుగుతున్న ట్రంక్ లైన్ పనులను సోమవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాతుల చెరువు, కుమ్మరికుంట చెరువులోకి డ్రైనేజీ నీరు వెళ్లకుండా ట్రంక్ లైన్ పనులు ప్రారంభించామని, ప్రస్తుతం చెరువుల్లోకి నీరు చేరకుండా పూర్తిగా నియంత్రించామన్నారు.