TPT: జిల్లాలోని సచివాలయ సిబ్బంది ప్రతి రైతు ఇంటికి వెళ్లాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలో సోమవారం జరిగిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అగ్రికల్చరల్ అసిస్టెంట్, వీఆర్వో, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ రైతుల ఇంటికి వెళ్లి పథకాలు గురించి చెప్పాలన్నారు.