NLR: చేజర్ల మండలంలోని పెరుమళ్ళపాడు సచివాలయం పరిధిలో ‘అన్నదాత సుఖీభవ’ ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాల గురించి రైతులకు వివరించారు. రైతులను ఎక్కువ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.