TG: హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్ల రేట్ల మరోసారి రికార్డ్ ధరలు పలికాయి. ఎకరం ధర రూ. 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 17,18 స్థలాలకు ప్రభుత్వం ఈ-వేలం వేసింది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉన్నాయి. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలు ఉన్నాయి. మొత్తం 9.9 ఎకరాలకు ప్రభుత్వానికి రూ. 1355.33 కోట్లు వచ్చాయి.