HYD: నగర సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. “డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ నంబర్ 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి” అని ‘X’లో ట్వీట్ చేశారు.