KNR: 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ చౌక్‌లో రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బకాయిల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త బక్క జాన్సన్‌ను అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. జాన్సన్‌ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.