WNP: ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి ఐడీవోసీ మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నేడు 30 ఫిర్యాదులు వచ్చాయన్నారు.