CTR: కార్వేటినగరం మండలం సురేంద్రనగరం కనుమ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో డ్రైవర్, లోడ్డుపై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కాలువలో పడగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.