ఆదిలాబాద్ రూరల్ మండలం బంగారిగూడలోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ కార్యాలయం సిబ్బంది సంతోష్ ఆధ్వర్యంలో ఎన్సీసీ విద్యార్థులకు సోషల్ మీడియా, జాబ్, లోన్ ఫ్రాడ్లపై వివరించారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కి కాల్ చేయాలని ఆయన సూచించారు.