NLG: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలపై అధికారులు 70 ఫిర్యాదులను స్వీకరించారు. 39 ఫిర్యాదులు జిల్లా అధికారులకు సంబంధించినవి కాగా 31 ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.