NDL: డోన్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎం.వీ. చలపతి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన కర్నూలు డిపో నుంచి బదిలీపై డోన్‌కు వచ్చారు. ఆయనను స్థానిక డిపో అధికారులు, సిబ్బంది, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. డిపో అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల పెంపు, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తాన్నారు. ఇక్కడ ఉన్న డిపో మేనేజర్ శశిభూషణ్ బదిలీపై గుంతకల్లుకు వెళ్లారు.