SKLM: అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని జేసీ ఫార్మన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి శాఖ తదితర శాఖలకు సంబంధించి ఆర్జీలు ఉన్నాయన్నారు.