MNCL: భార్యకు అనారోగ్యం ఉందని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కన్నేపల్లికి చెందిన చుంచు వంశీ నవంబర్ 8న నంది మేడారంకు చెందిన యువతితో వివాహమైంది. భార్య అనారోగ్యంతో బాధపడుతుందని మనస్థాపం చెంది ఈ నెల 21న గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.